Vinayaka Chavithi Patrinames In Telugu

Vinayaka Chavithi Patrinames In Telugu

వినాయక చవితిని అందరూ హిందువులు తమ వీధుల్లో ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి అనగానే కొందరు ప్రకృతి ప్రేమికులు.. నిమజ్జనం వల్ల నీరు కలుషితమవుతుందని వాపోతారు. వాస్తవానికి ప్రకృతిని పవిత్రంగా ఆరోగ్యాంగా చేసే ఎన్లో సుగుణాలు లక్షణాలు ఈ వినాయక పండుగాలి మనం చూడవచ్చు.. వినాయక చవితి పూజలో ఉపోయోగించి పత్రీ, దీనికి అతి పెద్ద ఉదాహరణ..

21 రకాల ఆకులతో అంటే 21 మిత్రులతో పూజ చేస్తారు. ఈ పాత్రులన్నింటికీ ఎన్నో ఔషధగుణాలుంటాయి. ఈ పత్రులు మురికి నీటిలో వదిల్తే ఆ నీరు పరిశుద్ధంగా తయారవుతుంది. 9 రోజుల పూజ తరువాత విగ్రహంతో పాటు ఆ 21 పాత్రులను భక్తులందరూ నిమజ్జనం చేస్తారు. ఈ 21 రకాల పాత్రులు ఏవి, వాటి పేర్లు, విశిష్టత గురుంచి తెలుసుకుందాం.

Vinayaka Chaviti 21 Patri names

1. మాచీ పత్రం:
ఈ మాచీ పత్రం చెంత జాతికి చెందినది. వీటి ఆకులు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. చూడడానికి ఇవి చేమంతి లాగే ఉంటాయి.

2. బృహతీ పత్రం
దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.l

3. బిల్వ పత్రం
బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు

4. దూర్వా పత్రం
దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి

5. దుత్తూర పత్రం
దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.

6. బదరీ పత్రం
బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.

7. అపామార్గ పత్రం
తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.

8. తులసీ పత్రం
హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు.

Read more at: https://telugu.boldsky.com/home-garden/gardening/2013/21-types-patra-patri-used-ganesh-puja/articlecontent-pf9949-006493.html

9. చూత పత్రం చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు.

10. కరవీర పత్రం
దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.

11. విష్ణుక్రాంత పత్రం
ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.

12. దాడిమీ పత్రం
దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.

13. దేవదారు పత్రం
దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.

14. మరువక పత్రం
దీనిని మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.

15. సింధువార పత్రం
సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు.

16. జాజి పత్రం
ఇది సన్న జాజి పువ్వు జాతికి చెందింది. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు

17. గండాలీ పత్రం
దీనికి లతాదూర్వా అనికూడా పేరు ఉంది. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది

18. షమీ పత్రం
జమ్మి చెట్టు ఆకులని షమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు

19. అశ్వత్థ పత్రం
రావి ఆకులని అశ్వత్థ పాత్రమంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం

20. అర్జున పత్రం
మద్ది చెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకులను పోలి ఉంటాయి

21. ఆర్కా పత్రం
జిల్లేడు ఆకులను ఆర్కా పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారు చేసిన వినాయక ప్రతిమను పూజిస్తే విశేష ఫలం ఉంటుందంటారు.

ఈ 21 పత్రాలతో ఎవరైతే వినాయక చవితి రోజున పూజిస్తారో, వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *