Telugu Love Letters

Telugu Love Letters

Love Letter To Girl From Boy

ప్రియా!

“ఏల సలిలమ్ము పారు
గాడ్పేల విసురు
ఏల ప్రేమింతు నిన్ను” అని అ ఓ భావ కవి అన్నాడు. నీ మీద నాకు ప్రేమ ఎలా పుట్టిందో గుర్తుకు లేదు. నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నా హృదయం పరితపిస్తోంది.. నీవు లేకపోతే బతకలేనేమో అని కూడా అనిపిస్తుంది. మనిద్దరము వేరైనా ఒక్కటే అని అనిపిస్తుంది.. నేను చెంత ఉన్నంత సేపు ఈ లోకాన్ని మరిచిపోయి ఎక్కడో తేలిపోతున్న అనుభూతి కలుగుతుంది.. కొన్ని రోజులుగా నువ్వు కనిపించడం లేదు, అప్పటి నుంచి నాకు నిద్ర లేదు.. నిన్ను ఒక సారి కలిసి తనివి తీరా చూడాలని ఉంది.. నీతో కొద్దీ సేపు మాట్లాడాలని కూడా ఉంది.. నువ్వు ఒక అంటే వరంలా ఫీల్ అవుతా..

నీ జవాబు కోసం ఎదురుచూస్తూ.. ఓ వన్ సైడ్ లవర్

Love Letter To Girl By Boy

ఓ ప్రియా..!

బుజ్జి నాకు ప్రేమగా మాట్లాడటం రాదూ.. కానీ పిచ్చిగా ప్రేమించడం వచ్చు. నేను ప్రేమించిన వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకుంటాను. అందుకే ప్రేమగా ప్రాణంగా చూసుకుంటాను.

నేను మాట్లాడే మాటల్లో ప్రేమ కనబకపోవచ్చు, కానీ నా మనస్సులో చచ్చిపోయే అంత ప్రేమ ఉంటుంది. నువ్వు నాకు ఎంత దూరంగా ఉన్నా ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటావు. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఆస్తులే అవసరం లేదు. మనమే ఆస్తిగా భావించే ప్రేమించే మనిషి తోడుంటే చాలు. ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏదీ లేదు.. నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప..

నా మనసుకి మాటలొస్తే.. అది పలికే తొలి మాట.. నువ్వంటే నాకిష్టమని..
నువ్వు ఎదురు చూసే చూపు నాకోసమే అయితే నువ్వు గడిపే ప్రతీ ఒక్క క్షణం నా కోసమే అయితే.. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నాకోసమే అయితే.. న జీవితం, నీకే అంకితం..

మనసు నిండిన ప్రేమతో రాస్తున్న ఓ కలల ప్రేమికుడు

Love Letter By Guy To Girl

ప్రియమైన నా హృదయంలోని రాణికి..

నా కనులకు కలలు కరువైన వేళా నీ కనులను చూశాను..
నా పెదవులకు చిరునవ్వు కరువైన వేళా నీ పెదవులను చూశాను..
నా మనసుకు మమతా కరువైన వేల మమత అనే నీ మనసును చూశాను..
ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు, ఏ క్షణం మరువకుండా నిన్నే తలుస్తున్నాను..
నీ ఊరేమిటో తెలీదుకానీ ఊహించాను, నీ పేరేమిటో తెలీదుకానీ ప్రేమించాను, నీ గుణం ఏమిటో తెలీదుకానీ నా గుణాలతో గణించాను, నీ మనసేమిటో తెలీదుకానీ నా మనసుతో జోడించాను..
త్వరలో..
నీ మనసును నా మనసుతో జోడిస్తావని అనుకుంటున్నాను. “I Love You” అని Facebook, whats ap లో చెప్పవచ్చు కానీ I Love You అని చెప్పడానికి మాత్రమే అవి సరిపోతాయి.
నాలో దాగి ఉన్న నీ మధుర జ్ఞాపకాలను చెప్పడానికి అవేవి సరిపోవు. ఏది ఏమైనా.. మీరు నా ప్రేమను అంగీకరిస్తే.. మీ కాళీ మువ్వల సడిలో అలజడినౌతాను.. కాదని నిరాకరిస్తే.. మీరు పీల్చే శ్వాసలో ఒక్క అనువైన నా శ్వాస ఉందని సంతోషిస్తాను.

ఇట్లు
నీ ప్రేమకోసం
పరితపించే
నీ ప్రేమికుడు

Love Letter By Girl To Boy

ప్రియమైన నీకు..

ఎలా రాయాలో తెలీదు ? ఏమి రాయాలో తెలీదు ? కానీ ఏదో రాయాలనిపిస్తుంది. నాలో ఉన్న భావాలన్నింటినీ అక్షరాలుగా మార్చాలనిపిస్తుంది. కానీ కలం ఒక్క అక్షరమైనా కదలలేకపోతోంది. రాణి దాన్ని రాయడం ఎందుకని నువ్వు అడగవచ్చు, కానీ చెప్పడం నా కాశాలు చేత కాదు, చెబుదామని ఎంత ప్రయత్నిస్తున్నా, మనసులో మాట గొంతుదాటి రావడం లేదు.

భావాన్ని తెలుపుదామని కలంపట్టుకుంటే చేయి కూడా సహకరించడం లేదు. చూపుల్ని చదవగలిగే భాషే కనుక నీకు వచ్చి ఉంటె నాకీ బాధ తప్పేది. నా కళ్ళలోని భావాలని సరిగా గమనించి ఉంటె వాటిలో నీ రూపాన్ని, నీ మీద పెంచుకున్న అనురాగాన్ని నీవు గ్రహించేవాడివి. అందుకే నా ఫీలింగ్స్ అన్నింటినీ కలిపి ఒకే మాటలో చెప్పేస్తున్నాను. “I Love You” అని. ఇంతకు మించి నాకు చెప్పడం రాదు.. రాయడం చేత కాదు..

ఇట్లు
ఇప్పటికైతే ఓ వన్ సైడ్ ప్రేమికురాలిని

Love Letter From Boy To Girl

ప్రియా..
నాకిప్పుడు మామూలుగా మాట్లాడడం, రాయడం రావడం లేదు, బహుశా ప్రేమలో పడినందుకేమో. సూర్యుడు కనపడగానే.. పద్మం మధ్యాహ్నం వరకు వేచిచూడకుండా అప్పటికప్పుడే విచ్చుకొని తన ప్రేమను తెలియ జేస్తుంది. చంద్రుణ్ణి చూడగానే కాలువ సైతం అప్పటికప్పుడే తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. ప్రకృతి అంతా నిర్మొహమాటంగా, ధైర్యంగా ఉంటుంది, కేవలం మనిషికి మాత్రమే ఏదైనా చెప్పాలన్న, చేయాలన్న ఒక కాలం కోసం వేచి చూసుత్న్నాడు.

ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకొని ఈ లేఖ రాస్తున్నాను. మిమ్మల్ని చూసిన మరు క్షణమే నా మనసు పాందించింది.. నాతో అన్ని కాలాల్లో మీరు తోడుగా ఉండాలనిపిస్తుంది. మీ మనసు వేరొకరికి ఇవ్వకుండా ఉంటె మీ అభిప్రాయాన్ని తెలపండి. మీ మనసు వేరొకరికి ఇచ్చి ఉంటె మౌనంగా ఉండండి..

మీ మౌనం అర్ధాంగీకారంగా భావించి జీవిత కాలం ఎదురు చూస్తాను..

మీ
మనసులో
స్థానం సంపాదించాలనుకొనే
ఓ ప్రేమికుడు

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *